MLC Kavitha: ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు.. రేపు విచారణకు హాజరుకావటం లేదు.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉంచిన ఎఫ్ఐఆర్‌ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్‌లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉంచిన ఎఫ్ఐఆర్‌ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్‌లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా.. రేపు నేను అందుబాటులో ఉండటం లేదని.. విచారణకు హాజరు కాలేనని సీబీఐ అధికారులకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

MLC Kavitha Respond : సీబీఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తనపేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపర్చిన ఎఫ్ఐఆర్‌ని క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొనిఉన్న నిందితుల జాబితాను కూడా చూశానని, కానీ, దానిలో నా పేరు ఎక్కడా లేదని సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు సోమవారం కవిత లేఖ రాశారు. రేపు సీబీఐ విచారణకుసైతం నేను హాజరు కావటం లేదని కవిత లేఖలో పేర్కొన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాలవల్ల ఈనెల 6వ తేదీన తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో నేను అందుబాటులో ఉంటానని, ఈ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒకరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి నేను సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేసిన తనకు సమాచారం ఇవ్వాలని సీబీఐ అధికారులను కవిత కోరారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒకరోజు సమావేశం అవుతానని కవిత లేఖలో స్పష్టం చేశారు.

MLC Kavitha’s letter to CBI officials

ఇదిలాఉంటే.. సీబీఐ విచారణకు సంబంధించిన వ్యవహారంలో గత వారంలో కవిత సీబీఐకి లేఖరాశారు. విచారణ విషయంలో క్లారిఫికేషన్ కోసం సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ లేఖ రాసిన విషయం విధితమే. ఆ లేఖకు స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్‌లో ఉన్నదని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు