MMTS TRAIN: ఎంఎంటీఎస్ రైలుకు తప్పిన ప్రమాదం.. భారీ శబ్దాలు రావడంతో పరుగులు తీసిన ప్రయాణికులు
బేంగపేట్ - నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే రైలు ఆగిపోయిన సమయంలో రైలు నుంచి భారీ శబ్ధాలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు పరుగులు పెట్టారు.
- Harish Thanniru
- Published on- September 30, 2022 / 10:49 AM IST
MMTS Trains
MMTS TRAIN: హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలుకు ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో రైలు నుంచి భారీ శబ్దాలు రావడంతోపాటు, ఒక్కసారిగా రైలు ఆగిపోయింది. దీంతో భయాందోళన చెందిన ప్రయాణీకులు రైలు నుండి దిగి పరుగులు పెట్టారు. రగంలోకి దిగిన రైల్వే అధికారులు పునరుద్దరణ పనులు చేపట్టారు.
MMTS : ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు తగ్గింపు
బేంగపేట్ – నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే రైలు ఆగిపోయిన సమయంలో రైలు నుంచి భారీ శబ్ధాలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు పరుగులు పెట్టారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఇదిలా ఉంటే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో లోకల్ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. రైలు ఉన్నట్లుండి ఆగిపోవడంతో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు నుంచి దిగిపోయిన ప్రయాణికులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలును వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
