Moderate Rains : తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు

తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు.... ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Moderate Rains :  తెలంగాణాలో రాగల మూడు రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు…. ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈరోజు  సముద్ర మట్టానికి సుమారు 5.8 కి.మీ. ఎత్తులో పయనిస్తూ ….దాని అనుబంధ ఉపరితల ఆవర్తనంతో పాటు  ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటలలో తూర్పు-మధ్య అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం వుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also Read : Ganja Seized : హైదరాబాద్‌లో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

తదుపరి ఇది ఇంచుమించు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఆంద్రప్రదేశ్- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న తూర్పు-మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈ నెల 18న చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా తూర్పు దిశ నుండి వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణం చలిగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు