Moinabad Farm House Case: డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్

  • Published On : March 16, 2026 / 12:23 AM IST

Representative Image (Image Credit To Original Source)

 

  • డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్
  • రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్
  • నిందితులు చంచల్ గూడ జైలుకి తరలింపు
  • పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు
  • నిందితుల బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

Moinabad Farm House Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించారు ఉప్పర్ పల్లి మేజిస్ట్రేట్. రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, నమిత్ కు రెండు వారాల రిమాండ్ విధించారు. నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు మొయినాబాద్ పోలీసులు. అటు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను మేజిస్ట్రేట్ తిరస్కరించారు. శనివారం ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, రితేశ్, నమిత్ సహా మరికొందరు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎంపీ మహేశ్ కు స్టేషన్ బెయిల్ లభించింది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముగ్గురు (రోహిత్ రెడ్డి, నితీశ్ రెడ్డి, నమిత్ శర్మ) నిందితులను ఉప్పరపల్లి జడ్జి ఇంటి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో 11మందిని ఇన్వాల్వ్ చేశారు పోలీసులు. వీరిలో 8మందికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఈ కేసులో న్యాయమూర్తి ముందు సుమారుగా గంటపాటు రోహిత్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆర్మ్ యాక్ట్ పైనా సుదీర్ఘ వాదనలు జరిగాయి. అక్కడ ఎలాంటి గన్ ఫైరింగ్ చేయలేదని రోహిత్ రెడ్డి లాయర్లు వాదించారు.

చంచల్ గూడ జైలుకి తరలింపు..

ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని చంచల్ గూడ జైలుకి తరలించారు మొయినాబాద్ పోలీసులు. 11 మంది డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లుగా ఈగల్ టీమ్ గుర్తించింది. వారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరైంది. నాటకీయ పరిణామాల నడుమ మీడియా కంటపడకుండా పుట్టా మహేశ్ ను పంపేశారు పోలీసులు.

పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు..

డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ టీమ్ ఫామ్ హౌస్ లో రైడ్స్ వెళ్లింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి సోదరుడి గన్ తీసుకుని నవీద్ శర్మ గాల్లోకి కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక వివరాలను జడ్జి ముందు పీపీ ఉంచారు. లైసెన్స్ కలిగున్న వ్యక్తి మాత్రమే రివాల్వర్ ఉపయోగించాలి. కానీ అతడు కాకుండా మరో వ్యక్తి తుపాకీ వాడాడు. ఇరు పక్షాల వాదనలను జడ్జి విన్నారు. పోలీసులపై హత్యాయత్నాన్ని జడ్జి తీవ్రంగా పరిగణించారు. నిందితుల బెయిల్ పిటిషన్లను జడ్జి తిరస్కరించారు. అంతేకాదు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆర్మ్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో నిందితులకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు జడ్జి.

Also Read: నేను చనిపోలేదు.. కేఫ్ లో కాఫీ తాగుతూ.. స్వయంగా వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు