MP Asaduddin Owaisi
MP Asaduddin Owaisi..Assam CM Himanta Biswa Sarma : కూరగాయల ధరలు పెరిగిపోవటానికి కారణం ‘మియా’ ముస్లింలే కారణం అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Assam cm Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ముస్లిం నేత..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. అన్నింటికి ముస్లింలను నిందించటం పరిపాటిగా మారిపోయిందని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ తప్పు జరిగినా ప్రతిదానికీ మియా ముస్లింలను నిందించే ఓ వర్గం ఈ దేశంలో ఉందన్నారు. ‘‘మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, మీ కోడి గుడ్డు పెట్టకపోయినా మియా ముస్లింలనే నిందిస్తారు’’అంటూ మండిపడ్డారు.తమ వ్యక్తిగత వైఫల్యాలకు కూడా వారినే నిందిస్తారంటూ ఎద్దేవ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ ముస్లింలతో గాఢమైన స్నేహాన్ని ఏర్పరచుకుంటున్నారన్నారు. వారిని టమాటాలు, బంగాళాదుంపలు, బచ్చలి కూర అడగండి అంటూ ఒవైసీ వ్యాఖ్యానించారు.
‘‘దేశంలో ఓ గ్రూపు ఉంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టకపోయినా దానికి ‘మియా’లే కారణమని వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారు” అని ట్వీట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. అంతేకాదు ‘‘విదేశీ ముస్లింలతో ప్రధానికి మంచి స్నేహం ఉంది కదా.. టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఇవ్వమని అడగొచ్చు కదా” అంటూ ప్రధాని పర్యటనలపై చమత్కరించారు.
కాగా..శుక్రవారం (జులై 14,2023) అస్సాంలోని ముస్లిం వ్యాపారులపై హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు.. ‘‘కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వ్యక్తులు ఎవరు? వాళ్లు మియా (బెంగాలీ మాట్లాడే ముస్లింలు) వ్యాపారులు.. కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు”అన్నారు.
CM Himanta Biswa Sarma : ముస్లింల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయి : అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
‘‘మియా వ్యాపారులు గౌహతిలో అస్సాం ప్రజలకు అధిక ధరలకు కూరగాయలను అమ్ముతున్నారని..గ్రామాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అస్సామీ వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నట్లయితే.. వారు తమ అస్సామీ ప్రజల నుంచి ఎన్నడూ ఎక్కువ వసూలు చేయరు” అని ఆయన చెప్పారు.
కాగా సీఎం హిమంత ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గౌహతిలో మీడియాతో మాట్లాడుతు..సీఎం హిమంత యువత నుంచి ముస్లింలను వేరు చేయటాకి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఇది చాలా బాధకలిగించేదని అన్నారు. కూరగాయల ధరలు పెరగటానికి ముస్లింలే కారణమని..ముస్లింలను కించపరిచేలా సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వాపోయారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం తగదు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్లో అశాంతిని కలిగిస్తాయని మనుషుల మధ్య సోదరభావాన్ని దెబ్బతీస్తాయని అస్సాం ప్రజల మధ్య అగాధం సృష్టిస్తాయని అన్నారు.