Venkat Reddy Absent Munugodu Meeting
Venkat Reddy Absent Munugodu Meeting : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విషయంలో తగ్గేదేలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటున్నారు. రేవంత్‌రెడ్డి విషయంలో బెట్టు వీడేది లేదంటున్నారు. మునుగోడుపై కీలక సమావేశం జరుగుతుంటే.. ఆ భేటీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. రేవంత్‌రెడ్డి మొహం చూడబోనని ఇటీవల కోమటిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుత భేటీకి రేవంత్‌రెడ్డి రావడంతో.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందులో పాల్గొనకుండానే వెనుదిరిగారు.
ఢిల్లీ నుంచి హైదరబాద్ బయల్దేరారు. అటు మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంకగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్, జీవన్‌రెడ్డితో పాటు శ్రీధర్‌బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఉప ఎన్నికపైనే అధిష్టానం చర్చ జరుపుతుంటే.. ఆ మీటింగ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నిక హడావుడి మొదలైనప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు.