Nama Nageswara Rao
MP Nama Nageswara Rao : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రైతుల కోసం రైతుబంధు, ఉచిత కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. కేసీఆర్ ని గద్దె దించే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం లేకుండా వచ్చి పాల్గొని, మాట్లాడారు. తనను ఎవరూ ఆత్మీయ సమ్మేళనాలకు పిలవాల్సిన అవసరం లేదన్నారు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి కేసీఆర్ కు కానుక ఇవ్వాలని పేర్కొన్నారు.
Nama Nageswararao : రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణకు అన్యాయం : నామా నాగేశ్వరరావు
ఐదు సంవత్సరాలలో మనకు కనపడని వ్యక్తి వచ్చి నయా మాటలు చెప్తున్నాడని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులు, పేదల వ్యతిరేకం అన్నారు.