TPCC Chief Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..? నేడే ప్రకటన?

TPCC Chief Revanth Reddy: తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎవరు? ఎన్నో నెలలుగా తెలంగాణలో ఉత్కంఠగా సాగుతోన్న ప్రశ్న. ఇవాళ(21 జూన్ 2021) దీనిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఉత్తమ్ రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. పీసీసీ పదవి కోసం ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డారు. ఢిల్లీలోనే మకాం వేసి పెద్ద స్థాయిలో లాబీయింగ్ కూడా చేశారు.

అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎంపీ రేవంత్‌ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ ఎంపికలో ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయిన తర్వాత అధిష్టానం.. పోటీలో ఉన్న వారిని సముదాయించి, సీనియర్లందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

పోటీలో ఉన్నవారిని సముదాయించిన పెద్దలు.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నేడే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉండవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ ఎంపికలో ఉన్న అడ్డంకులను క్లియర్ చేసిన అధిష్టానం.. ఈమేరకు పోటీలో ఉన్నవారిని సముదాయించిన పార్టీ పెద్దలు.. రేవంత్‌ను వ్యతిరేకించే వారికి ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్లు చేసి సముదాయించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు