Nizampet : ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్‌ను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే?

వరదల కారణంగా ఎస్ఆర్ కాలేజ్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరింది. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో మున్సిపల్ అధికారులు కాలేజ్ ను సీజ్ చేశారు. క్యాంపస్ లో అయిదు వందల మంది ..

Nizampet Municipal Corporation

SR Residential College : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. కాలేజ్ క్యాంపస్ కబ్జా వ్యవహారం హైడ్రా దృష్టికి వెళ్లింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంపేట్ రోడ్డు హిల్ కౌంటి ఎదురుగాఉన్న పత్తికుంట చెరువులోకి వరద నీరు చేరింది. పత్తికుంట చెరువు దాదాపు పది ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు ఎకరాల్లో చెరువును ఆక్రమించి ఎస్ఆర్ రెసిడెన్షియల్ కాలేజ్ నిర్మాణం జరిగింది.

Also Read : Telangana Rains : తెలంగాణలో 11జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఇవాళకూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

వరదల కారణంగా ఎస్ఆర్ కాలేజ్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరింది. విషయం తెలుసుకుని పూర్తి ఆధారాలతో మున్సిపల్ అధికారులు కాలేజ్ ను సీజ్ చేశారు. క్యాంపస్ లో అయిదు వందల మంది విద్యార్థులు ఉన్నారు. వర్షం కారణంగా సెలవులు అంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది.

 

ట్రెండింగ్ వార్తలు