Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతథం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.

Municipal elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపోల్స్‌ను కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

కోవిడ్ -19 ప్రభావం తీవ్రమవుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఎలక్షన్ ప్రక్రియ మధ్యలో ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కే వదిలేసింది. కోర్టు సూచన మేరకు ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అభిప్రాయం కోరింది.

తాజా పరిస్థితులను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఎన్నికల కమిషన్ రాసిన లేఖ మేరకు ఇదే సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌, జడ్చర్ల కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.

మరోవైపు ఇవాళ్టితో నామినేన్ల విత్ డ్రాకు గడువు ముగియనుంది. దీంతో ప్రచారం ఊపందుకొనుంది. అయితే వైరస్ ఉధృతి కారణంగా ప్రచారంపై ఆంక్షలు విధించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ప్రచార సమయాన్ని కుదిస్తు ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉన్న ప్రచార సమయాన్ని…రాత్రి 8 గంటల వరకే పరిమితం చేసింది. లౌడ్ స్పీకర్లను కేవలం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వినియోగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే వైరస్ ప్రభావం కొనసాగితే ప్రచార శైలిపై సైతం ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు