‘నా విజయం దుబ్బాక ప్రజలకు అంకితం’ : రఘునందన్ రావు

  • Publish Date - November 10, 2020 / 08:10 PM IST

Raghunandan Rao respond : తన విజయాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రకటించారు. తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో బీజేపీ విజయంతో పాలకులకు కనువిప్పు కలగాలన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు.



అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకొని పోరాడమన్నారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి, దేశం కోసం, ధర్మం కోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ, నియంతృత్వ అప్రజాస్వామకి పాలనకు చెరమగీతం పాడాలని ప్రజలు బీజేపీని గెలిపించారని తెలిపారు. ఏ గడ్డ మీద తాను చదువుకున్నానని ముఖ్యమంత్రి చెప్పుతారో ఆ గడ్డ నుంచి వచ్చిన రీసౌండ్ ఇదని..ఈ సౌండ్ వినాలని ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నట్లు తెలిపారు.



అరాచకరం, నియంతృత్వం, వ్యవస్థల ద్వారా పెత్తనం చేసి వ్యక్తులను హించాలని చూస్తే సౌండ్ ఇలాగే వస్తుందని సీఎంకు దుబ్బాక ప్రజలు చెప్పారని పేర్కొన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పై 1,470 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. 22 రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది.

ట్రెండింగ్ వార్తలు