Boat Service : శ్రీశైలానికి బోట్ సర్వీసు తాత్కాలికంగా నిలిపివేత

నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

Boat Service

Boat Service : నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య నడిచే క్రూయిజ్ బోట్ సర్వీసులను తెలంగాణ పర్యాటక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. బోట్ తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని టూరిజం శాఖను అటవీ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బోట్ సర్వీసులు నిలివేశారు. కాగా ఈ బోట్ దాదాపు అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ప్రయాణిస్తుంది.

చదవండి : Boat Trip : పాపికొండల్లో బోటు యాత్ర

నాగార్జునసాగర్ నుంచి నందికొండ, శ్రీశైలం వెళ్లే బోట్ మార్గం మొత్తం అటవీ శాఖ పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం కేటాయించాలని కోరింది. ఇక దీనిపైనే టూరిజం, అటవీ శాఖ అధికారులు త్వరలో చర్చించనున్నారు. చర్చల అనంతరం తిరిగి బోట్ కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు టూర్‌లకు టికెట్‌ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లిస్తే ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది.

చదవండి : Boat Capsizes : నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు