Komatireddy Brothers
Nalgonda DCC: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త డీసీసీల నియామకం చిచ్చు రేపింది. చాలాచోట్ల అసంతృప్తి రచ్చకెక్కినప్పటికీ… నల్లగొండ డీసీసీ ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. సొంత జిల్లాలో మాట నెగ్గించుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..అధిష్టానం నిర్ణయానికి ఓకే చెప్పాలని రాజగోపాల్రెడ్డి..చెరో విధంగా రెస్పాండ్ అవడం చర్చకు దారితీస్తోంది.
పున్నా కైలాష్ నేతకు నల్గొండ డీసీసీ పగ్గాలు అప్పగించిన వేళ మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ న్యూస్ హెడ్ లైన్‌గా మారింది. కైలాష్ నేతను డీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించడంపై మంత్రి వెంకట్ రెడ్డి గుర్రుగా ఉంటే..ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వాగతిస్తున్నారు.
డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన పున్నా కైలాష్ నేతను పార్టీ నుంచే తీసేయాలని జిల్లాకే చెందిన మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తుండటం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. మంత్రి ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదట. నల్లగొండ డీసీసీగా తన ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఇప్పించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. మోహన్ రెడ్డికి దక్కకపోగా.. గతంలో తనపై తీవ్రమైన విమర్శలు చేసిన పున్నా కైలాష్ నేతకు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారట.
Also Read: అమరావతికి గెజిట్.. కేంద్రం లైన్ క్లియర్ చేస్తుందా? రాబోయే పార్లమెంట్ సెషన్‌లో అమరావతి బిల్లు?
సేమ్ టైమ్ పున్నా కైలాష్ గతంలో తనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండటంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంకా రగిలిపోతున్నారట. అప్పుడెప్పుడో తనపై విమర్శలు చేసిన కైలాష్ నేతపై ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తానని..ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కోమటిరెడ్డి లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో కాకరేపుతోంది.
కొత్త డీసీసీ నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇలా ఉంటే..ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు మరోలా ఉంది. డీసీసీ ప్రెసిడెంట్ గా పున్నా కైలాష్ నేత ఎంపికను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వాగతించారు. కైలాష్ నేతను రాజగోపాల్ రెడ్డి ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అభినందించారు. డీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అన్న అలా..తమ్ముడు ఇలా తీరుగా రియాక్ట్ అవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అన్నదమ్ముల మధ్య ఇందుకే గ్యాప్?
అన్నదమ్ముల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అనే టాక్ వినిపిస్తుంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి కాస్త గట్టిగానే పట్టుబడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే..వెంకట్ రెడ్డిని తప్పించాలని షరతు పెట్టిందట ఏఐసీసీ. త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని..టాక్ వినిపిస్తోంది.
రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే.. నల్లగొండ కోటాలో మూడు మంత్రి పదవులు కానున్నాయి. పైగా ముగ్గురు రెడ్డి సామాజికవర్గం నేతలు అవుతారు. దాంతో వెంకట్ రెడ్డిని తప్పిస్తారనే గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయాలపై సానుకూలంగా రియాక్ట్ కావాలని రాజగోపాల్ భావిస్తున్నారట. ఎట్ ది సేమ్ టైమ్..నల్లగొండ జిల్లా పాలిటిక్స్లో తన ముద్ర ఉండాలని తహతహ లాడుతున్నారట వెంకట్ రెడ్డి.
ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మినహా..జనరల్ పది నియోజకవర్గాల్లో బీసీలకు ఒక్కటి మాత్రమే ఇవ్వగలిగారు. ఆలేరు మినహా మిగతా జనరల్ సీట్లలో రెడ్లకే అవకాశం ఇచ్చారు. బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనందున..పార్టీ పదవుల్లో పెద్దపీట వేశారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు కొత్త జిల్లాలు ఉంటే రెండు జిల్లాలకు బీసీ నేతలను డీసీసీ ప్రెసిడెంట్గా నియమించారు.
మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా..నల్లగొండ డీసీసీ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ ఎపిసోడ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగామా చేస్తున్నా పార్టీ రాష్ట్ర నాయకత్వం సైలెంట్గా గమనిస్తోంది. ఇదేసమయంలో మంత్రి కోమటిరెడ్డితీరును నిరసిస్తూ పున్నా కైలాష్ నేతకు మద్దతుగా బీసీ సంఘాలు సైతం రంగంలోకి దిగడం రచ్చ రాజేస్తోంది. ఈ వ్యవహారాన్ని హస్తం పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.