ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం

Nalgonda: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 11 కోట్ల 7లక్షల 41 వేల రూపాయల నగదు, మద్యాన్ని..

లోక్‌సభ ఎన్నికల వేళ డబ్బు, మద్యం భారీగా పట్టుబడుతోంది. నల్గొండ జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 11 కోట్ల 7లక్షల 41 వేల రూపాయల నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాడపల్లి, నాగార్జున సాగర్, టెయిల్ పాండ్ లో రాష్ట్ర సరిహద్దు వద్ద అంతరాష్ట్ర సమీకృత చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని నల్గొండ ఎస్పీ చందనదీప్తి అన్నారు.

ఎన్‌హెచ్ 65, నాగార్జున సాగర్ హైవేపై అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పారామిలీటరీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చందన దీప్తి తెలిపారు.

ఇటీవల కూడా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్రమదారుల్లో నగుదును తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు కేటుగాళ్లు.

వారిపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: కిషన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు