Nalgonda Canal Car Casse
Nalgonda District Car Accident : నల్లగొండ జిల్లా గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో మునిగిన కారు ఆచూకీ ఇంకా లభించలేదు. కారు కోసం ఉదయం నుంచి గజ ఈతగాళ్లు కాలువను జల్లెడ పట్టిన లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కారు ఆచూకీ లభిస్తేనే ఈ కేసులో మరింత క్లారిటీ వస్తుందంటున్నారు పోలీసులు. ఇప్పటికే కాలువలో నీటి ప్రవహాన్ని తగ్గిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే కారు ఆచూకీ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read More : Nalgonda : కాలువలో కారు కేసులో కొత్త ట్విస్ట్-కారు చోరీకి గురైందన్న యజమాని విఘ్నేశ్వరి
కాలువలో కారులోకి తోసింది మల్లికార్జున్, విఘ్నేశ్వరి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిద్దరికి మతిస్థిమితం సరిగా లేదంటున్నారు బంధువులు. ఈ కారు కూడా విఘ్నేశ్వరిదిగా గుర్తించారు పోలీసులు.. ఇటీవలే కొనుగోలు చేసిన ఈ కారు.. మిర్యాలగూడలోని ఓ థియేటర్ వద్ద పార్క్ చేసిన సమయంలో చోరి అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది విఘ్నేశ్వరి. అయితే అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో నుంచి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో కారును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. కారు మొత్తం నీటిలో మునిగిపోవడంతో వెలికితీసేందుకు కష్టంగా మారింది.
Read More : Nalgonda Hot Summer : అగ్నిగుండంలా నల్లగొండ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
నిన్న రాత్రి రెస్క్యూ కొనసాగినా.. చీకటి పడడంతో కారును బయటకు తీసే పనిని ఆపేశారు. అసలు కారు కాలువలోకి ఎలా వెళ్లిందనే విషయంపై ఎడమ కాలువ పక్కన గ్రామాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోగువారిగూడెం, చిల్లాపురం పరిధిలోనే కారు కాలువలో పడి ఉండే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం సమీపంలో కారును ఉద్దేశ్యపూర్వకంగా ఇద్దరు కాలువలోకి తోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో లగేజీ, ఇతర వస్తువులు అన్ని ఉంచి కాలువలోకి నెట్టేశారని అంటున్నారు. కారు బయటపడితేనే కానీ.. పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.