Nampally Court : మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ను మార్చారని, ట్యాంపరింగ్ చేశారని శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా  కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

Nampally People Representatives Court

Nampally People Representatives Court : మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

సాయంత్రం 4 గంటల లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిపోర్టు సబ్ మిట్ చేయాలని మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ తారుమారు చేశారన్న కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

Azharuddin: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అజారుద్దీన్ పోటీకి సై.. అంజ‌న్‌కుమార్ సలహాతో కంగుతిన్న అజ్జూ భాయ్!

కానీ దానికి సంబంధించి జిల్లా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ను మార్చారని, ట్యాంపరింగ్ చేశారని శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా  కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. దానిపై పూర్తి వివరాలను అందించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వివరాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకపోవడంపై మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై కోర్టు సీరియస్ అయింది.

TS High Court : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

గత నెల (జులై)30వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో అప్పుడు ఉన్నవంటి ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్, ఆర్డీవోలు, ఎన్నికల విధులు నిర్వహించిన మొత్తం అధికారులపై కేసులు నమోదు చేయాలని తెలిపింది. శ్రీనివాస్ గౌడ్ సహా పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సబ్ మిట్ చేయాలని చెప్పిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి పోలీసులపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.