Devaanshs Dhoti Ceremony: దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌.. సందడి చేసిన నారా, నందమూరి ఫ్యామిలీలు

ఈరోజు కుటుంబసభ్యులంతా కలిసి ఎందో ఆనందంగా దేవాంశ్ ధోతీ వేడుక జరుపుకున్నామని తెలపారు. ఈ క్షణం మాకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

  • Published On : March 14, 2026 / 10:54 PM IST

Representative Image (Image Credit To Original Source)

 

Devaanshs Dhoti Ceremony: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైదరాబాద్ లో సందడిగా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అంతా కలిసి ఫొటోలు దిగారు. వీటిని లోకేశ్ ఎక్స్ లో షేర్ చేశారు. దేవాన్ష్ ఎదుగుదల చూసి తామందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు తండ్రి లోకేశ్. ఈ వేడుకలో భాగంగా నందమూరి బాలకృష్ణ దంపతులు దేవాన్ష్‌తో పాటు లోకేశ్, బ్రాహ్మణికి నూతన వస్త్రాలు పెట్టారు.

”ఈరోజు దేవాంశ్ ధోతీ వేడుకను ఎంతో హ్యాపీగా జరుపుకున్నాము. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు ఈ వేడుకకు వచ్చారు. దేవాంశ్ ఎదుగుదల మా అందరికీ గర్వకారణం. దేవాంశ్ జీవితాంతం ఆనందంగా ఉండాలి. విజయాలు సాధించాలి” అని కోరుకున్నారు నారా లోకేశ్. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారాయన.

అటు దేవాంశ్ ధోడీ ఫంక్షన్ ఫోటోలను బ్రాహ్మణి తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ఈరోజు కుటుంబసభ్యులంతా కలిసి ఎందో ఆనందంగా దేవాంశ్ ధోతీ వేడుక జరుపుకున్నామని తెలపారు. ఈ క్షణం మాకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. దేవాంశ్ జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అతను తను కన్న కలలన్నీ సాధించాలని కోరుకున్నారు. ఈ మేరకు ధోతీ ఫంక్షన్ ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు బ్రాహ్మణి.

అటు చంద్రబాబు, బాలకృష్ణ అభిమానులు సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తాము ఎంతగానో అభిమానించే వ్యక్తులు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. దేవాంశ్‌కు సైతం తమ విషెస్ తెలియజేస్తున్నారు. దేవాంశ్ కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని దీవిస్తున్నారు.