Authorities Neglect : బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరణ

జోగుళాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. బ్రతికుండగానే మరణించినట్లు ధృవీకరించారు.

Neglect Of The Authorities Certification Of Death While Alive

Neglect of the authorities : జోగుళాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మహిళ బ్రతికుండగానే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. జిల్లాలోని అయిజ మండలం బింగిదొడ్డిలో అధికారుల నిర్లక్ష్యం.. అంధురాలికి శాపంగా మారింది.

పెన్షన్‌ రావడం లేదని.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బ్రతికుండగానే తమ పేరును పెన్షన్‌ జాబితాలో మరణించినట్లు ధృవీకరించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.