Neopolis Land Auctions: హెచ్ఎండీఏ నియోపోలీస్ లేఔట్ ప్లాట్ల వేలం పాట ముగిసింది. ఇక్కడి భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. 19 ప్లాట్ నెంబర్ లో ఎకరం రూ.131 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 19లో మొత్తం నాలుగు ఎకరాలు ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 20 రూ.118 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20 విస్తీర్ణం 4.04 ఎకరాలు. మొదటి 2 వేలం పాటలతో పోలిస్తే ఈరోజు భారీగా ధర తగ్గింది. గత నెల 28న నిర్వహించిన వేలం పాటలో ఒక ఎకరం ధర అత్యధికంగా 151 కోట్ల రూపాయలు పలికింది. ఈ లేఔట్ లో అత్యల్పంగా ఎకరం ధర రూ.118 కోట్లుగా ఉంది.
Also Read: టీసీయూఆర్‌గా మారనున్న జీహెచ్ఎంసీ..!