Telangana New Secretariat : తెలంగాణ ఖ్యాతి పెంచేలా నూతన సచివాలయం, కేసీఆర్ వల్లే ఇంత భారీ నిర్మాణం సాధ్యం- ప్రశాంత్ రెడ్డి

Telangana New Secretariat : తెలంగాణకే గొప్ప గౌరవం నిలిపేలా నిర్మాణం జరిగిందన్నారు. కొత్త సచివాలయంతో పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందన్నారు.

Telangana New Secretariat : కొత్త సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతోనే సాధ్యమైందని, చాలా గర్వంగా ఉందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటేనే గొప్ప ఆలోచనలు నిజం చేసే వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రతిరోజూ అలుపు లేకుండా కేసీఆర్ పని చేయడం ద్వారానే ఇంత భారీ నిర్మాణం సాధ్యమైందన్నారు. సచివాలయ నిర్మాణంపై కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈర్ష్యతోనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణకే గొప్ప గౌరవం నిలిపేలా నిర్మాణం జరిగిందన్నారు. సీఎం, మంత్రి, సెక్షన్, ఉద్యోగులు ఒకేచోట ఉండేలా సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. కొత్త సచివాలయంతో పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందన్నారు. తెలంగాణ ఖ్యాతి పెంచేలా సచివాలయం నిలుస్తుందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 700 లారీల సాండ్ స్టోన్ సచివాలయ నిర్మాణంలో వాడినట్లు తెలిపారు.

Also Read..Chintala Ramachandra Reddy: హైదరాబాద్ విశ్వనగరమా, విషాద నగరమా.. చిన్న పాటి వర్షానికే మునక?

” నిర్మాణంలో వాడిన ప్రతిదీ ప్రత్యేకం. ప్రతి డిజైన్ సీఎం ఫైనల్ చేశారు. ప్రధాన ద్వారం మధ్యప్రదేశ్ లో తయారు చేయించాం. తెలంగాణ ఠీవి చాటేలా ఎక్కడా లోటు లేకుండా సచివాలయం నిర్మాణం జరిగింది. సీఎం, మినిస్ట్రీ, సెక్షన్లలో ఆధునిక టెక్నాలజీ వాడాము. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో నిర్మాణం జరిగింది. ప్రతి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలి. అన్ని సౌకర్యాలతో సచివాలయం నిర్మాణం.

Also Read..CM KCR: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

గతంలో సచివాలయం చెల్లా చెదురుగా ఉండేది. ఇప్పుడు డిపార్ట్ మెంట్ అంతా ఒక దగ్గర ఉంటుంది. ఇలా సచివాలయం వేరే ఎక్కడా ఇలా లేదు. దేశంలో మొదటి ప్రయత్నం. 30 కాన్ఫరెన్స్ హాల్స్. అంతర్జాతీయ అతిథులకు ఆతిథ్యం. ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా.. సచివాలయం నిలుస్తుంది” అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు