×
Ad

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో రూ.345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌

ఈ హై సిటీ ప్రాజెక్ట్‌ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు.

Representative Image (Image Credit To Original Source)

  • సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం
  • 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ
  • ఈ ప్రాజెక్టు కోసం టెండర్లకు ఆహ్వానం

GHMC: జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్‌ సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ ప్రాజెక్టును 345 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఈ హై సిటీ ప్రాజెక్ట్‌ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు.

ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే.. విమానాశ్రయానికి వెళ్లేవారు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ జంక్షన్‌ల వంటివాటి వద్ద వాహనాలను ఆపకుండానే వెళ్లిపోవచ్చు. ఇరు వైపులా సాఫీగా ప్రయాణం సాగుతుంది.

అంతేగాక, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే వాహనదారులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

టెండర్‌లో ప్రాజెక్ట్‌ ఏ ఏజెన్సీకి దక్కుతుందో అదే ఏజెన్సీకి సర్వేతో పాటు డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనుల బాధ్యత ఉంటుంది. అగ్రిమెంట్‌ చేసుకున్న రెండేళ్లలో పనులను పూర్తి చేయాలి. యుటిలిటీ షిఫ్టింగ్‌తో పాటు ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌ స్కేపింగ్, పేవ్‌మెంట్‌ మార్కింగ్స్‌ వంటి పనులన్నీ చేయాలి.