Slot System For Registrations : తెలంగాణలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మరింత ఈజీ కానుంది. జస్ట్ 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేదిక. అవినీతికి ఆస్కారం లేకుండా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తి కానుంది. ఇందుకోసం సులువైన వ్యవస్థను తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే స్లాట్ బుకింగ్ విధానం. ఈ నెల 10వ తేదీ నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమల్లోకి రానుంది.
అసలేంటి స్లాట్ బుకింగ్, ఎలా బుక్ చేసుకోవాలి, ఏయే రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానం అమలు చేస్తారు, స్లాట్ బుక్ చేసుకోకుండా నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లొచ్చా, అదనపు ఛార్జీలు చెల్లించాలా, అసలు ఈ స్లాట్ బుకింగ్ విధానంతో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం కలగనుంది..
15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, తొలుత 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలు..
ప్రస్తుతం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇకపై ఆ బాధ ఉండదు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా 22 కార్యాలయాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read : పెద్దాయన నిరసన గళం.. వెనుక రీజన్ ఏంటి? హస్తానికి గుడ్ బై చెప్పేస్తారా… కారెక్కేస్తారా..?
ఇక్కడ బుక్ చేసుకోండి..
registration.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
స్లాట్ బుక్ చేసుకోకుంటే..
స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం అత్యవసర సందర్భాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారు.
* పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి అదనపు సిబ్బంది నియామకం.
* రోజువారీ పని వేళలను 48 స్లాట్‌లుగా విభజించి, రద్దీని నివారించేందుకు ఏర్పాట్లు.
* ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లతోపాటు సిబ్బంది నియామకం.
* కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అందుబాటులో 144 స్లాట్స్.
Also Read : HCU భూముల వివాదం ఇప్పట్లో ఆగదా? భారీ కుంభకోణం ఉందన్న కేటీఆర్.. ఏం జరగనుంది?
తొలుత ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలు..
22 కేంద్రాల్లో స్లాట్ విధానం ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్- ఆజంపుర, చిక్కడపల్లి
సంగారెడ్డి జిల్లా – సదాశివపేట
మేడ్చల్ జిల్లా – కుత్బుల్లాపూర్
రంగారెడ్డి జిల్లా – శంషాబాద్, సరూర్‌నగర్, చంపాపేట్
పెద్దపల్లి జిల్లా – రామగుండం
ఖమ్మం జిల్లా – కూసుమంచి
ఖమ్మం ఆర్వో
మహబూబ్‌నగర్ ఆర్వో
జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్ట్, వరంగల్ గ్రామీణ, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అమలు.
ఇక రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్లు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పడుతోంది. దీంతో దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమయం కూడా వృథా అవుతోంది. దీన్ని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఈ-సంతకం ప్రవేశపెడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏప్రిల్ నెల చివరిలోగా అందుబాటులోకి తెస్తామన్నారు.