పెద్దాయన నిరసన గళం.. వెనుక రీజన్ ఏంటి? హస్తానికి గుడ్ బై చెప్పేస్తారా… కారెక్కేస్తారా..?

అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు.

పెద్దాయన నిరసన గళం.. వెనుక రీజన్ ఏంటి? హస్తానికి గుడ్ బై చెప్పేస్తారా… కారెక్కేస్తారా..?

MLC Jeevan Reddy

Updated On : April 9, 2025 / 9:14 PM IST

కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియ‌ర్ నేత ప్లాన్‌-బీ అమలు చేయబోతున్నారా.? తాజా పరిణామాలు ఆ పెద్దాయ‌న ప్రస్ట్రేషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయా..? ఆయన హస్తం పార్టీ మారేందుకు ప్లాన్‌ చేస్తున్నారా.. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేపై అటాకింగ్‌ చేస్తున్నారా.. మరి ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడేందుకు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇంతకీ ఆ సీనియర్ నేత అడుగులు ఎటువైపు..?

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో కొత్తగా పరిచయం అక్కర్లేని పొలిటిషియన్.. మాజీ ఎమ్మెల్సీ తాటిప‌ర్తి జీవన్ రెడ్డి. ఫార్టీఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే జీవన్ రెడ్డికి ఈమధ్య సత్కారాల కంటే ఛీత్కారాలే ఎక్కువవుతున్నాయట. 2018 ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఆయనకు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.

ఆ పదవితో విపక్షంలో పార్టీ గళాన్ని గట్టిగా వినిపించిన ఆయనకు.. గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగానూ, నిజామాబాద్‌ ఎంపీగానూ పోటీ చేసే అవకాశమిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. అయితే రెండు ఎన్నికల్లోనూ ఆయనకు పరాజయం తప్పలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసింది.

అయితే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు. పూర్తిస్థాయి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చకుంటున్నారని బహిరంగంగానే ప్రశ్నించారు జీవన్ రెడ్డి. ఈ విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డికి చెడిందని పార్టీలో ఇన్నర్ టాక్. అందుకే జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ముగిసినా ఏ పదవి ఇవ్వలేదనే గాసిప్స్ గాంధీభవన్‌లో ఇప్పటికీ రీసౌండ్ చేస్తూనే ఉంటాయి.

జీవన్‌రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకే బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన వర్గీయులు ఎప్పటి నుంచో మండిపడుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్‌రెడ్డి రగిలిపోతూనే ఉన్నారు. ఆ మధ్య జీవన్ రెడ్డి పార్టీ మారుతారంటూ పొలిటికల్‌ సర్కిళ్లలో బహిరంగ టాక్ వినిపించింది. మంత్రుల బుజ్జగింపుల తర్వాత జీవన్‌రెడ్డి కాస్త చల్లబడిపోయారు. గంగారెడ్డి హత్య జరిగినప్పుడు కూడా జీవన్‌రెడ్డి నిరసన గళం వినిపించారు.

పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి చురుకలు
జగిత్యాలలో తనకు ప్రయార్టీ తగ్గిస్తున్నారంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు జీవన్‌రెడ్డి.. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు జగిత్యాల జగడానికి దారి తీశాయి. గతంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యాలు చేసినోడు.. అధికారం పోగానే మళ్లీ కాంగ్రెస్‌లో చేరి పెత్తానం చెలాయిస్తున్నాడంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల శ్రమ ఫలితామే ఉందంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి చురుకలంటించారు జీవన్ రెడ్డి.

Also Read: HCU భూముల వివాదం ఇప్పట్లో ఆగదా? భారీ కుంభకోణం ఉందన్న కేటీఆర్.. ఏం జరగనుంది?

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో బిగ్‌ డిబెట్‌కు దారితీశాయి. జీవన్ రెడ్డికి పార్టీలో చాలా ద‌గ్గర‌గా ఉండే మంత్రులు భ‌ట్టివిక్రమార్క, శ్రీధ‌ర్ బాబు, ఉత్తమ్‌ కుమార్‌, విప్‌లు అడ్లూరి ల‌క్ష్మణ్ కుమార్‌, ఆది శ్రీనివాస్‌ లాంటి నేతలు కూడా ఈ మ‌ధ్య ఆయనతో టచ్‌ మీ నాట్ అన్నట్లు ఉంటున్నార‌ట‌. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జీవ‌న్ రెడ్డి అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గాసిప్స్ మొదలయ్యాయి. అధిష్టానం స్పందించి నోటీసులు ఇస్తే.. వాటిని సాకుగా పెట్టుకొని జీవన్ రెడ్డి పార్టీ మారే ఛాన్స్ ఉందనేది ఆయన వ్యతిరేక వర్గీయుల మాట.

జీవన్‌రెడ్డికి కావాలనే సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశమివ్వలేదని ఆయన వర్గీయుల అధిష్టానం నిర్ణయంపై ఇంకా గుర్రుగానే ఉన్నారు. ప్రస్తుతం జగిత్యాల్లో ఎమ్మెల్యే మాటే శాసనం అవుతుందట. దీంతో జీవన్ రెడ్డి వర్గీయులు కోపంతో ఊగిపోతున్నారని జగిత్యాల పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్.

తన అనచరులకు బాసటగా నిలిచి ధైర్యం నింపాలనుకుంటున్న జీవన్ రెడ్డి పార్టీ మారే యోచన చేస్తున్నారని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ పార్టీ మారితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్తారా.. కమలం కండువా కప్పుకుంటారా అనే చర్చ కూడా మొదలైంది. కేసీఆర్‌తో జీవన్‌రెడ్డికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కారణంగా గులాబీ గూటికే చేరే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్‌ఎస్ పార్టీకి జగిత్యాల నుంచి బలమైన నాయకుడు దొరికినట్లవుతుంది.

ఈ పరిణామాలతో… కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌ రెడ్డి విషయంలో ఎప్పుడు సైలెంట్‌గా ఉండే ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ గేర్ మార్చి ఫైర్‌ బ్రాండ్‌గా మారిపోయారు. మొత్తానికి జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. సంజయ్‌కుమార్ రివర్స్ అటాక్‌తో ఇప్పుడు జ‌గిత్యాల పాలిటిక్స్ టాక్‌ ఆఫ్ ది స్టేట్‌గా టర్న్‌ తీసుకున్నాయి. మరి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు మళ్లీ బుజ్జగిస్తారా.. లేదంటే లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.