Gachibowli Gayatri Case
Gachibowli Gayatri Case : సంచలనం రేపిన గచ్చిబౌలి గాయత్రి కేసు.. పోలీసుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. గచ్చిబౌలి సీఐ సురేశ్.. గాయత్రికి సహకరించారంటూ ఆమె తండ్రి, అక్క చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. 2020 నుంచి గాయత్రి తల్లి, అక్క ఇచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోలేదనే దానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా గాయత్రి ఉంటున్న ప్లాట్ లోకి తల్లి కృష్ణవేణి, అక్క సౌజన్య అక్రమంగా ప్రవేశించారంటూ ఎందుకు కేసు పెట్టారు? అనే దానిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో సీఐ సురేశ్ పాత్రపై ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
కాగా, గచ్చిబౌలిలో యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పక్కా ప్లాన్‌తోనే యువతిపై గాయత్రి దాడి చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ముందుగానే ఐదుగురు నిందితులను పిలిపించి ఇంట్లో దాచిన గాయత్రి.. ఆ తర్వాత బాధిత యువతిని ఇంటికి రప్పించింది. ఆమె తల్లిదండ్రులను బయటే ఉంచి.. యువతిని మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మాటేసి ఉన్న ఐదుగురు నిందితులు.. యువతిపై విరుచుకుపడ్డారు.(Gachibowli Gayatri Case)
Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్
నలుగురు కలిసి ఆమెను వివస్త్రను చేయగా.. మరో నిందితుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అదే సమయంలో యువతిని బూతులు తిడుతూ.. ఆమెపై గాయత్రి దాడి చేసింది. అంతేకాదు ఇదంతా వీడియో తీసింది. ఎవరికైనా చెప్తే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. మరోవైపు ఈ నేరంలో గాయత్రి భర్త శ్రీకాంత్ పాత్ర ఉందా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగినప్పుడు శ్రీకాంత్ ఇంట్లో లేడని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
గచ్చిబౌలి గాయత్రి కేసులో విచారించే కొద్ది కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గచ్చిబౌలి సీఐపై గాయత్రి తల్లి కృష్ణవేణి తీవ్ర ఆరోపణలు చేశారు. గాయత్రికి సీఐ సురేశ్ మద్దతు ఉందని తెలిపారు. గాయత్రిపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అదే గాయత్రి తమపై ఫిర్యాదు చేస్తే ఇట్టే కేసులు నమోదు చేశారని చెప్పింది. 2020 జూన్‌లో తమను ఇంటి నుంచి గాయత్రి గెంటేసిందని ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోలేదని కృష్ణవేణి చెబుతోంది.
గాయత్రికి మద్దతుగా తమపై పోలీసులు పలు కేసులు పెట్టారంటున్న కృష్ణవేణి.. తనపై 4, తన పెద్ద కుమార్తెపై 8, అల్లుడిపై 4, కొడుకుపై మరో నాలుగు కేసులు పెట్టినట్లు తెలిపింది. ఈ వివాదంలో కీలక సూత్రధారి శ్రీకాంత్‌ను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని కృష్ణవేణి చెబుతోంది. అటు పోలీసులు మాత్రం కృష్ణవేణి ఆరోపణలను ఖండించారు. గాయత్రి తల్లి ఇచ్చిన ఫిర్యాదు గురించి తనకు తెలియదని సీఐ సురేశ్ చెబుతున్నారు. గాయత్రికి, కుటుంబ సభ్యులకు మధ్య ఆస్తి తగాదాలున్నాయని సీఐ సురేశ్ వెల్లడించారు.
Husband murder Wife: భార్యను హత మార్చిన ‘సాఫ్ట్‌వేర్’ భర్త: తిరుపతిలో దారుణ ఘటన