Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్

హైదరాబాద్ గచ్చిబౌలి  పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు పూర్తి స్ధాయిలో విచారణ జరిపితే ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో మరి..

Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్

gachibowli rape case

Hyderabad :  హైదరాబాద్ గచ్చిబౌలి  పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు పూర్తి స్ధాయిలో విచారణ జరిపితే ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో మరి..

సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న యువతిని రేప్ చేయించిన కేసులో అరెస్టైన  గాయత్రి 2009 లోనే ఇంట్లోంచి   పారిపోయి తన క్లాస్ మేట్ ను పెళ్లి చేసుకుంది.   2014లో భర్తపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి అతని నుంచి దూరంగా ఉంటోంది.  పధకం ప్రకారమే శ్రీకాంత్, గాయత్రి ఈ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. బాధితురాలు శ్రీహర్షితకు చెందిన ఆస్తి కాజేయటానికి   శ్రీకాంతే, గాయత్రీతో ఈ రేప్ వ్యవహారం అంతా నడిపించినట్లు సమాచారం.

శ్రీకాంత్  శ్రీకాకుళం వాస్తవ్యుడు. అతని  తల్లి తండ్రులు చిన్న పూరి గుడిసె లోనివసిస్తుంటారు. వారు రోడ్డుపై సెకండ్ హ్యాండ్ దుస్తులు విక్రయించుకుని జీవనం సాగిస్తున్నారు. బాధితురాలు శ్రీహర్షితతో   శ్రీకాంత్ కు శ్రీకాకుళంలోనే  పరిచయం ఏర్పడింది.  తాను కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు మాయమాటలు   చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.  శ్రీ హర్షితతో తన పరిచయాన్ని గాయత్రికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

ఈ క్రమంలో 2020 జూన్ లో గాయత్రితో తన తల్లిని   ఇంట్లోనుంచి బయటకు గెంటించాడు. ఈ సంగతి తెలిసి శ్రీకాంత్ అక్క అడగటానికి వస్తే గాయత్రితో ఆమెను కూడా కొట్టి బయటకు పంపించాడు. ఈక్రమంలో శ్రీ హర్షితను  2021 లో శ్రీకాంత్ హైదరాబాద్ తీసుకు వచ్చాడు.  2021 అక్టోబర్ లో   గాయత్రి ద్వారా శ్రీహర్షితను తమ ఇంట్లోనే ఉండమని చెప్పించాడు.  దీంతో శ్రీహర్షిత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 2022 వరకు వారి ఇంట్లోనే ఉంది.

శ్రీకాంత్, శ్రీ హర్షితల మధ్య సన్నిహిత  సంబంధం ఉందని అనుమానించిన గాయత్రి 2022 ఏప్రిల్ నెలలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో   వీరిద్దరిపై   వివాహేతర సంబంధం కేసు నమోదు చేయించింది. కేసు విత్ డ్రా చేయించుకోవటం   కోసం మే 26న శ్రీహర్షిత కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించింది గాయత్రి.   అదే రోజు సాయంత్రం శ్రీహర్షిత తల్లితండ్రులను బయటే ఉండమని చెప్పిన గాయత్రి   శ్రీహర్షితను లోపలికి తీసుకువెళ్లి నలుగురితో  అత్యాచారం చేయించింది.

ఆ సమయంలో సున్నితమైన శరీర భాగాలపై కొట్టటంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. ఆ దృశ్యాలను వీడియో తీయించి ఎవరికైనా చెపితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ హెచ్చరించి బయటకు పంపించింది. అప్పటికే   తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే   గాయత్రితో సహా మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.  ఈ కేసులో శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని బాదితురాలి తల్లి కోరుతోంది.

Also Read : Gachibowli Rape Attempt : గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం చేయించిన మహిళ.. న్యూడ్ వీడియోలు తీసి