Anchor Swetcha Case: పెళ్లి చేసుకుంటానన్నాడు, నాలుగేళ్లు కలిసి ఉన్నాడు, ఆ తర్వాత.. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

పూర్ణచందర్ మోసం చేశాడని తెలుసుకున్న స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురైందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Anchor Swetcha Case: తెలుగు న్యూస్ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పూర్ణచందర్ ను అరెస్ట్ చేశారు. పూర్ణచందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పూర్ణచందర్ స్వేచ్ఛను పలువురు రాజకీయ నేతలకు పరిచయం చేశాడని అందులో పేర్కొన్నారు. ఓ న్యూస్ చానల్ కార్యాలయంలోనూ స్వేచ్ఛను పూర్ణచందర్ అందరికీ పరిచయం చేశాడని అందులో పొందుపరిచారు. పెళ్లి పేరుతో పూర్ణచందర్ స్వేచ్ఛకు నాలుగు సంవత్సరాలు లైంగికంగా దగ్గరయ్యాడని చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వేచ్ఛతో కలిసి ఉన్నాడు పూర్ణ చందర్. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ అడిగితే పూర్ణచందర్ ముఖం చాటేశాడన్నారు. పలుమార్లు పెళ్లి ప్రస్తావ తెస్తే స్వేచ్ఛపై పూర్ణచందర్ దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. పూర్ణచందర్ మోసం చేశాడని తెలుసుకున్న స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురైందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఓ న్యూస్ చానల్ లో యాంకర్ గా పని చేస్తున్న జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జవహర్ నగర్‌లోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుంది. తమ కూతురి మృతికి పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో పూర్ణచందర్ స్వేచ్ఛను మోసం చేశాడని, వేధింపులకు గురి చేశాడని వారు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు పూర్ణచందర్ పై బీఎన్ఎస్ 69, 108 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తన తల్లితో పాటు పూర్ణచందర్ తనను కూడా ఇబ్బంది పెట్టాడని స్వేచ్ఛ కూతురు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో పూర్ణచందర్ పై పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. కొన్నేళ్లుగా పూర్ణచందర్‌తో స్వేచ్ఛ సహజీవనం చేసింది. ఈ క్రమంలో స్వేచ్ఛను వివాహం చేసుకోకుండా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్ణచందర్ మోసం చేశాడని గ్రహించిన స్వేచ్ఛ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: “హలో.. నేను హీరోయిన్‌ని మాట్లాడుతున్నాను” అంటూ సంభాషణలు.. ఆశపడి రూ.21 లక్షలు సమర్పించుకున్న యువకుడు.. చివరికి..