Night Curfew : తెలంగాణలో పస్ట్ డే నైట్‌ కర్ఫ్యూ సక్సెస్

తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. రాత్రంతా కర్ఫ్యూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

night curfew success : తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. రాత్రంతా కర్ఫ్యూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాల్లోనూ పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. అయితే నిత్యావసర, ఎమర్జెన్సీ సేవలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడంతో వాటి కార్యాకలపాలు జరిగాయి.

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8 గంటలకే బార్లు, వైన్‌ షాపులు, థియోటర్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, మాల్స్ అన్ని బంద్‌ అయ్యాయి. ఎక్కడికక్కడ బారికేడ్లు వేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. పంజాగుట్ట, బేగంపేట్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్, తార్నాక, ఉప్పల్‌ ప్రధాన రోడ్డుల్లో తనిఖీలు చేశారు. పెట్రోల్ బంక్‌లు, మెడిక‌ల్ షాపులు తెరుచుకునే ఉన్నాయి.

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి. తెలంగాణలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది.

ప్రభుత్వం విధించిన నైట్‌ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలతో దురుసుగా ప్రవర్తించరాదని, నియమ నిబందనలపై వారికి అవగాహన కల్పించాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు