‘NIMS’ as a bone hospital and became the Nizam Institute of Sciences
NIMS: హైదరాబాద్ లోని నిమ్స్ లో 2022లో మొత్తం 6,05,248 మంది ఔట్-పేషెంట్లకు సేవలు అందించారు. అలాగే, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారి సంఖ్య 47,725గా ఉంది. తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిన్న వార్షిక ఆరోగ్య నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం.. నిమ్స్ లో గత ఏడాది 13,10,584 మందికి రోగనిర్ధారణ పరీక్షలు చేశారు.
23,961 శస్త్రచికిత్సలు జరిగాయి. నిమ్స్ లో పడకల సంఖ్య మొత్తం 1,489గా ఉంది. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో భాగంగా మరో 2,000 పడకలను పెంచనున్నారు. పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుతారు. 2022లో ఎంఎన్జే కేన్సర్ సంస్థను కూడా ఆధునికీకరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచారు.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపి ఔట్-పేషెంట్ల సంఖ్య 4.83 కోట్లుగా ఉంది. అలాగే, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వారి సంఖ్య 16.97 లక్షలుగా నమోదైంది. మొత్తం 3.04 లక్షల ఆపరేషన్లు చేశారు. ఆసుపత్రిలో ప్రసవాల శాతం గత ఏడాది 97 శాతంగా ఉంటే ఇప్పుడు 99.99 శాతానికి పెరిగింది.
5-year-old girl dies: ఐదేళ్ల బాలికపై పడ్డ గేటు.. పాప మృతి.. ఇద్దరి అరెస్టు