Riaz Encounter: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వినాయక్‌నగర్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సారంగాపూర్ ప్రాంతంలో రియాజ్‌ను నిన్న పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
అతడిని అరెస్టు చేసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రి నాలుగో అంతస్తులోని ఓ రూమ్‌లో రియాజ్‌కు చికిత్స అందింది. ఆసుపత్రి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇవాళ నిజామాబాద్ సీపీ సాయిచైతన్య వైద్యులతో మాట్లాడారు.
ఇవాళ నిజామాబాద్ ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని రియాజ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.
కాగా, మొన్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి చంపిన రియాజ్, నిన్న కూడా ఆసిఫ్ అనే కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే రియాజ్‌కు కూడా గాయాలు కావడంతో అతడిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రిలో చేర్చారు. ఇవాళ పోలీసులపై కూడా అతడు దాడికి యత్నించడంతో ఎన్‌కౌంటర్ అయిపోయాడు. రియాజ్‌పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి.