Nizamabad: నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో రెండు రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు ఇవాళ నిందితుడు రియాజ్‌ను పట్టుకున్నారు.
సారంగాపూర్ ప్రాంతంలో రియాజ్ పోలీసులకు చిక్కాడు. జనకంపేట రహదారిపై ఫేమస్ దాబా ఎదుట ఆ సమయంలో రియాజ్ ఒక షెడ్డులో దాక్కున్నాడు. అతడిని పట్టుకునే క్రమంలో రియాజ్ ప్రతిఘటించాడు. పోలీసులకు సహకరించిన వ్యక్తిపై కూడా దాడి చేశాడు. రియాజ్‌ను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రమోద్ హత్య కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. (Nizamabad)
Also Read: Viral Video: షాకింగ్.. తలుపుని బద్దలుకొట్టి తుపాకులతో వచ్చిన పోలీసులు.. ఏడ్చిన చిన్నారి..
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను శుక్రవారం రాత్రి రియాజ్ హత్య చేశాడు. ప్రమోద్ అంత్యక్రియలను పోలీసు అధికార లాంఛనాలతో నిన్న మధ్యాహ్నం నిర్వహించారు. ప్రమోద్‌ను హత్య చేసిన వ్యక్తి ఆచూకీని చెబితే రూ.50 వేలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. చివరకు ఇవాళ రియాజ్ పోలీసులకు చిక్కాడు.
ప్రమోద్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. కానిస్టేబుల్‌ను నిందితుడు కత్తితో హత్య చేస్తుండగా అక్కడే ఉన్న వారు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.