Nara Lokesh Nara Bhuvaneswari and Nandamuri Balakrishna
Balakrishna : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతోపాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురందేశ్వరి, లక్ష్మీపార్వతి, మోత్కుపల్లి నర్సింహులు, బాబూ మోహన్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు.