Challan : ఒక స్కూటీ .. 130 చలానాలు రూ.35,950 బకాయి.

ఒక బండికి ఎన్ని చలానాలు ఉంటాయి.. మా అంటే ఓ ఐదో, పదో ఉంటాయి. కానీ ఓ వ్యక్తి బండికి మాత్రం ఏకంగా 132 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. సోమవారం పోలీసులు వాహనం ఆపి తనిఖీ చేయడంతో ఈ విషయం బయట పడింది. 132 చలానాలకు గాను సదరు వ్యక్తి రూ.35,950 బకాయి పడ్డాడు.

Challa

Challan : జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ చౌరస్తా వైపు వచ్చిన TS 10 ER 7069 నెంబర్ గల స్కూటీని పోలీసులు ఆపారు. అనంతరం చలానాలు పరిశీలించారు. 130 చలాన్లు ఉన్నట్లుగా తేలింది.. దీంతో పోలీసులు అవాక్కయ్యారు.

130 చలానాలకు గాను రూ.35,950 బకాయి ఉన్నట్లు ఓనర్ కు తెలిపారు. అయితే తన స్కూటీపై చలానాలు ఉన్న విషయం తెలిసి పోలీసుల కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో చలానా కట్టలేనని చెప్పి వాహనం అక్కడే వదిలేసి వెళ్ళాడు. దీంతో పోలీసులు వాహనం సీజ్ చేశారు.