Old Woman : కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు

శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.

old woman jumped well

Old Woman Jumped Well : రాజన్నసిరిసిల్ల జిల్లాలో కోతులకు భయపడి ఓ వృద్ధురాలు బావిలో దూకారు. తర్వాత రక్షించాలంటూ కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంటనే బావిలోకి తాడు వేసి ఆమెను కాపాడారు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన గంభీర్ పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. పెన్షన్ డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నారు.

శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.

East Godavari Accident : అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి, ఇద్దరు గల్లంతు

అయితే అక్కడే ఉన్న ఓ యువకుడు బావిలోకి దిగి ఆమె నడుముకు తాడు కట్టాడు. తర్వాత బావి వెలుపల ఉన్న స్థానికుల సాయంతో వృద్ధురాలిని క్షేమంగా పైకి తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.