Woman Reservation Bill : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న ఎమ్మెల్సీ కవిత..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భార‌త జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద శుక్రవారం (మార్చి 10,2023) భార‌త జాగృతి నిరాహార దీక్ష‌ చేపట్టనున్నారు.

one day strike at delhi jantar mantar by MLC kavitha

Woman Reservation Bill : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భార‌త జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద శుక్రవారం (మార్చి 10,2023) భార‌త జాగృతి నిరాహార దీక్ష‌ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి MLC Kavitha హైదరాబాద్ లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించటానికే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు.

మ‌హిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా ఇకనైనా మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి లభించాలని ఆకాంక్షిస్తూ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు( Woman Reservation Bill )ను పార్ల‌మెంట్ ముందుకు తీసుకురావాల‌ని భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద మార్చి 10న ఒక‌రోజు నిరాహార దీక్ష చేయ‌నున్న‌ామని..ఈ దీక్ష‌కు అన్ని పార్టీలు, సంఘాల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేషన్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. మార్చి 13 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయి కాబ‌ట్టి.. ఈ స‌మావేశాల్లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నామని కవిత అన్నారు. లిక్కర్ స్కామ్ ను డైవర్ట్ చేయటానికి తాను మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నాననే విమర్శలు సరికాదన్నారు. నాపై ఈ ఆరోపణలు చేసే బీజేపీ కూడా ఓ విషయం ఆలోచించాలని అదానీ ఇష్యూని పక్కదారి పట్టించటానికే వంట గ్యాస్ ధర పెంచారా? అంటూ ప్రశ్నించారు.

మోడీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడల్లా సీబీఐ,ఐటీలతో దాడులు చేయిస్తారు అంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు బీజేపీకి అలవాటేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్లీనరీకి ముందు కూడా ఇలానే జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐటీదాడులుచేయించారి గుర్తు చేశారు.