Hyderabad Crime : వంటిపై చిరిగిన బట్టలు.. పక్కనే బీరు బాటిల్.. అనుమానాస్పద స్థితిలో డ్యాన్సర్ మృతి
హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30) ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్
- kunduru Vinod
- Updated on- November 9, 2021 / 09:49 AM IST
Hyderabad Crime (2)
Hyderabad Crime : హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30) ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్. ఈమెకు ఏడుగురు సంతానం.. గతేడాది భర్త నదీం మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఫాతిమాపై పడింది. ఆమె ఆర్కేస్ట్రా ట్రూప్ డాన్స్ తోపాటు చిన్న చితక పనులు చేస్తూ పిల్లలను పోషిస్తుంది.
చదవండి : Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు
ఇక మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది.
ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయిన పిల్లలు.. ఇప్పుడు తల్లిని కోల్పోవడంతో అనాథలుగా మారారు.
చదవండి : Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు
మృతదేహంపై చిరిగిన బట్టలు, పక్కనే బీర్ బాటిల్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎవరైనా హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టానికి తరలించారు.
