టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రయాణికుల్లో అవగాహన కల్పించాలని భావిస్తోంది. అంతేకాదు.. కండక్టర్లు టికెట్ ఇవ్వకపోయినా.. ప్రయాణికుడే అడిగి మరీ టికెట్ తీసుకోవాలి. లేకపోతే రూ.500 జరిమానా విధించనుంది ఆర్టీసీ. గతంలో ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే దానికి కండక్టర్ ను బాధ్యులుగా చేసేవారు. వారికి నోటీసులు ఇచ్చేవారు. ఇకపై.. టికెట్ పూర్తి బాధ్యత ప్రయాణికుడిపైనే ఉండనుంది.
ఆర్టీసీ బస్సుల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. బస్సు ఎక్కిన వెంటనే టికెట్ తీసుకోవాలి. అది ప్రయాణికుడి బాధ్యత. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం టికెట్ తీసుకోకుండానే జర్నీ చేసేస్తున్నారు. కండక్టర్ వారి దగ్గరకి వెళ్లే సరికి స్టాప్ వచ్చేయడంతో బస్సు దిగి వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది బస్ పాస్ లేకపోయినా ఉందని చెప్పి టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు. టికెట్ తీసుకోకపోతే రూ.500 జరిమానా కట్టాల్సి వస్తుందని బస్సులో హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రం టికెట్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సిటీ బస్సుల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
కొన్ని సార్లు చెకింగ్ అధికారులకు దొరికిపోయి జరిమానాలు పడినా.. కొందరిలో మార్పు రావడం లేదు. ఇంకొంతమంది టికెట్ తీసుకోమని తమను కండక్టర్ అడగలేదని… తమ వైపు రాలేదని బుకాయిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా కండక్టర్ ను బురిడీ కొట్టించి బస్సులో టికెట్ తీసుకోకుండానే ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి వారి వల్ల కండక్టర్ల ఉద్యోగానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెకింగ్ అధికారులు టికెట్ తీసుకోని వారికి రూ.500 జరిమానా విధించడమే కాకుండా కండక్టర్లను బాధ్యులను చేస్తూ వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు.
కానీ..ఇక పై ఇలా జరగదు. ఇప్పుడు రూల్ మారింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకుండా కండక్టర్ ను బురిడీ కొట్టించి ప్రయాణాలు చేసే వారి పట్ల కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. పూర్తి బాధ్యత ప్యాసింజర్ దే అనే తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం కండక్టర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సో.. ప్యాసింజర్లు.. బీ కేర్ ఫుల్.. కండక్టర్.. ఇంకా మనల్ని అడగలేదనో.. నా దగ్గరికి రాలేదనో.. తప్పించుకోవాలని చూశారో.. జేబుకి చిల్లు తప్పదు. కండక్టర్లను అడిగి మరీ టికెట్ తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రయాణికులదే.
Also Read : మందుబాబులకు న్యూఇయర్ షాక్ : దొరికితే రూ.10వేలు ఫైన్.. వాహనం సీజ్