Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్‌ ఇస్తా : మొగులయ్య

తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగులయ్య అన్నారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానంటూ 12 మెట్ల కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కోటి రూపాయలు సొంత డబ్బేమైనా ఇస్తున్నాడా అంటూ బీజేపీ వాళ్లు తనతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తనపై రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ శ్రీ అవార్డు బీజేపీ వాళ్లదని వాదిస్తున్నారని… అందుకే వాపస్‌ ఇచ్చేస్తానన్నారు. తనకెందుకు బద్నామ్‌ అంటూ వాపోయారు.

తన నోట్లో మన్ను కొట్టాలని చూస్తే పాపం తగులుతుందని మొగులయ్య అన్నారు. తనకు వెనుకా ముందూ ఏమీ లేదని, పేద కుటుంబం ఉన్నోడనని పేర్కొంటూ తనను రాజకీయాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నా చితకగా కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ అప్పుడప్పుడు పాటలు పాడేవాడినని, తన కళను తొలిగా టీఆర్ఎస్ ప్రభుత్వమే గుర్తించిందని వివరించారు.

Kinnera Mogulaiah : పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కోటి రూపాయలు, ఇంటి స్థలం.. కేసీఆర్ భారీ నజరానా

సీఎం కేసీఆర్ తన కళను గుర్తించి రవీంద్ర భారతిలో ఆరేళ్ల క్రితమే సత్కరించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడే తాను బయటి లోకానికి తెలిసానని వివరించారు. ఆ తర్వాతే ఓ సినిమాలో పాట పాడానని, అనంతరం తనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తనను ఎవరూ పట్టించుకోలేదని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే తనను గుర్తించిందని చెప్పారు మొగులయ్య.

ట్రెండింగ్ వార్తలు