Mahabubnagar
Mahabubnagar : మహబూబ్ నగర్ మహిళలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించారు. కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులు తయారు చేశారు. వాటితో అతిపెద్ద సెంటెన్స్ తయారు చేశారు. మహబూబ్ నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్ లో గిన్నిస్ వర్దల్డ్ రికార్డ్ అటెంప్ట్, లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని పరిశీలించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కల్పిస్తూ ఆ సంస్థ ప్రతినిధి రిషి నాథ్ అధికారికంగా ధృవీకరించారు. 24 వేలమంది మహిళలు 10 రోజుల సమయంలో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ తయారు చేశారు.
ఈ ఘనత సాధించిన మహిళలకు వివిధ పార్టీల నేతలతోపాటు, అధికారులు అభినందనలు తెలిపారు. ఇటువంటి మరిన్ని రికార్డులు సృష్టించాలని కోరారు.