Student Eating Noodles
Khammam Studient: త్రినేష్ అనే విద్యార్థి హాస్టల్‌లో ఉంటూ ఆరవ తరగతి చదువుతున్నాడు. హాస్టల్‌లో పెట్టే ఫుడ్ తినడం ఇష్టం లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇంతలోనే ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటినుంచి రుచికరమైన ఆహారాలు తీసుకొచ్చి తమ విద్యార్థులు అందిస్తుంటారు. అయితే త్రినేష్ తల్లిదండ్రులు రాకపోవటంతో తనతోటి విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన ఫ్రైడ్ రైస్, నూడిల్స్ తిన్నాడు. ఇంకా ఆకలి తీరకపోవటంతో హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తన వద్ద ఉన్న డబ్బులతో నూడిల్స్ తిన్నాడు. అనంతరం హాస్టల్ కు వచ్చి నిద్రపోయాడు. ఈ క్రమంలో విద్యార్థి స్టడీ క్లాస్ కు హాజరు కాలేదు.
NABI Recruitment : నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
త్రినేష్ స్టడీ క్లాస్ కు రాకపోవడంతో డ్యూటీ టీచర్ అతన్ని వెతుక్కుంటూ హాస్టల్ గదిలోకి వెళ్లిచూడగా నిద్రపోతూ కనిపించాడు. దీంతో విచక్షణ కోల్పోయిన టీచర్ బాలుడ్ని చితకబాదాడు. స్టడీ క్లాస్ కు డుమ్మా కొడతావా అంటూ కాళ్లతో మెడపై తుంతూ అమానుషంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ ను నిలదీసే ప్రయత్నం చేయగా.. వారిపై దురుసుగా వ్యవహరించాడు.
Allu Arjun : న్యూయార్క్‌లో హాలీవుడ్ డైరెక్టర్‌ని కలిసిన అల్లు అర్జున్.. సినిమా కోసమేనా?
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు టీచర్ ఓవర్ యాక్షన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు టీచర్ హాస్టల్ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పట్ల ఇంతదారుణంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.