×
Ad

Party Changed MLAs : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్..

Party Changed MLAs : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న

gaddam prasad kumar

Party Changed MLAs : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా.. ఇద్దరు ఎమ్మెల్యేలు నేటికీ స్పందించలేదు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై రెండు విడతల్లో సాగిన స్పీకర్ విచారణ శనివారం పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించని ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మ

స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్ నియోజకవర్గం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) పై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అయితే, గడువు పెంచాలని స్పీకర్ కూడా సుప్రీంకోర్టుకు కోరినట్లు తెలిసింది.

2023 డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎం. సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ చర్యలు తీసుకోకపోవటంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై31న సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. అక్టోబర్ 30వ తేదీలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు.