Peddi Sudarshan Reddy : గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆస్పత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డి.. మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని (Peddi Sudarshan Reddy ) మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 26, 2026 / 04:19 PM IST
Peddi Sudarshan Reddy shifted to Yashoda Hospital via green channel
Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, పోలీసు భద్రత మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన్ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. యశోదలో అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక వైద్యుల బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అంబులెన్స్ వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి తదితరులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.
Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు యశోద ఆస్పత్రికి తీసుకువచ్చాం. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోంది. త్వరలోనే పూర్తిగా కోలుకుని బయటకు వస్తారు అని అన్నారు.
అలాగే.. కార్యకర్తలు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల్లో వస్తున్న అసత్య ప్రచారాలు బాధాకరమని పేర్కొంటూ, ధృవీకరణ లేకుండా దురదృష్టకరమైన వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.
