Pen Ganga : ఉధృతంగా ప్రవహిస్తోన్న పెన్ గంగా.. NH44 హైవేపై వాహనాల రాకపోకలు నిలిపివేత

డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.

Pen Ganga

Pen Ganga – Vehicular Traffic Stop : తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో NH44పై నిన్నటి (శనివారం) నుండి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

తెలంగాణ, మహారాష్ట్ర రెండు వైపుల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 4 లక్షల 80 వేల క్యూసెక్కులుగా ఉంది. చెనక కోరాట బ్యారేజ్ వద్ద పెన్ గంగా నిండుగా ప్రవహిస్తోంది. చెనాక కోరాట పంప్ హౌస్ జలదిగ్భందంలో చిక్కుకుంది.

IMD Issues Red Alert : వచ్చే ఐదు రోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ రెడ్ అలర్ట్

పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేశారు. మహారాష్ట్ర వైపు పిప్పల్ కోటి వద్ద వాహనాల ఆపివేశారు. NH44 మూసివేసినందున పెన్ గంగా ప్రవాహం తగ్గే వరకు హైవే పైకి రావొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. NH44 హైవేపై నిన్న రాత్రి నుండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పెన్ గంగా పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ చేరుతోంది.

ట్రెండింగ్ వార్తలు