Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనడానికి ఫలితాలు నిదర్శనం : ఉత్తమ్

సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy – BRS Government : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడానికి ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను బలంగా విశ్వసించారని, అందుకే భారీ మెజార్టీ ఇస్తున్నారని తెలిపారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆర్వో జగదీష్ రెడ్డి నుండి గెలుపు పత్రాన్ని అందుకున్నారు.

ఈ మేరకు 10టీవీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. హుజూర్ నగర్, కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయమని తాను ముందు నుండే చెబుతున్నానని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం గెలిచిన అభ్యర్థులం అందరం సమావేశం అవుతామని చెప్పారు.

Indrakaran Reddy : తెలంగాణలో ఓడిపోయిన ఆరుగురు మంత్రులు

ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సీనియర్ ప్రజా ప్రతినిధిగా, పీసీసీ మాజీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నానని తెలిపారు. సీఎం అభ్యర్థి విషయంలో అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో జారే ఆధినారాయణ ఘన విజయం సాధించారు. ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ విజయం సాధించారు.

ట్రెండింగ్ వార్తలు