Smita Sabharwal
Smita Sabharwal Controversy Comments : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ లో వికలాంగుల కోటాపై ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై వికలాంగులు ఆందోళనకు దిగారు. పలువర్గాల ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. సామాజిక వేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్పీ చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.
Also Read : స్మిత సబర్వాల్ వాఖ్యలపై సీఎం రేవంత్ సహా కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించాలి : బాల లత
పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే, పిటిషనర్ కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ ఒక వికలాంగురాలు అని అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Disability Quota Row: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన టీడీపీ నేత.. క్షమాపణ చెప్పాలని డిమాండ్