ఫార్మసీ విద్యార్థిని ఘటన : పక్కా ప్లాన్, నలుగురు డ్రైవర్ల హస్తం!

Abandons

Pharmacy student incident : హైదరాబాద్‌ శివార్లలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నలుగురు ఆటో డ్రైవర్ల హస్తం ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ నలుగురిని భువనగిరి SOT పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. యానంపేటకు చెందిన రాజు, శివ, రమేష్, భాస్కర్ లు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. నిందితులంతా 30 ఏళ్ల లోపు యువకులేనని తెలుస్తోంది. అమ్మాయిని కిడ్నాప్ చేయాలని వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించాని పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది. నలుగురు నిందితుల్లో ఒకరు ముందుగా..యువతితో సానిహిత్యంగా మెలిగేవాడని గుర్తించారు. ఘటన జరిగిన అనంతరం ముగ్గురు ఆటో డ్రైవర్లు మద్యలో ఆటో ఎక్కినట్లు విచారణలో రాబట్టారు. నాగారం సర్కిల్ వద్దనున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించగా…సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు.

ముందస్తు వ్యూహంతోనే..బాధితురాలిని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే..దాడి చేసేందుకు ముందుగా రాడ్లు, కర్రలను సిద్ధంగా ఉంచుకున్నారు. కిడ్నాప్ చేయగానే..దాడికి పాల్పడ్డారు. నిందితులకు ఎవరెవరు సహకరించారనే దానిపై పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు.

విద్యార్థిని బీ ఫార్మసీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈమె సెకండియర్ చదువుతోంది. ఎప్పుడొస్తుంది ? ఎక్కడకు వెళుతుంది ? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయం ఏంటీ అనే దానిపై ముందుగానే విషయాలను సేకరించి పెట్టుకున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బాధితురాలిని తొలుత మేడిపల్లి క్యూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స అనంతరం మెడికల్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.