ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు జూన్ 9న 8 గంటలపాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇవాళ మరోసారి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌కు సిట్ చెప్పింది.
దీంతో ఇవాళ రెండోసారి సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ప్రభకర్ వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాలని అధికారులు ఆదేశించారు. గతంలో వాడిన ఫోను, ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని చెప్పింది. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన ల్యాప్‌టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని ఆదేశించింది.
Also Read: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. భారీగా పోలీసుల మోహరింపు
ప్రణీతరావుతో పాటు ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు జరిపిన కార్యకలాపాలపై సిట్ ఆరా తీస్తోంది. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై కూడా విచారణ జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ప్రశ్నిస్తోంది.
ప్రణీతరావుకి హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయాలని చెప్పిన వారెవరు అంటూ ఆరా తీస్తోంది. పాత హార్డ్ డిస్క్‌లు తీసి కొత్త హార్డ్ డిస్క్‌లు పెట్టాలని చెప్పిన వారు ఎవరు అంటూ విచారిస్తోంది. మొన్న జరిగిన విచారణలో ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పి.. మరికొన్ని ప్రశ్నలకు మాట దాటవేసినట్లు తెలుస్తోంది.