Telangana Bhavan
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ జేబులో నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. మరో నేత పర్స్‌ను కూడా కొట్టేశారు జేబు దొంగలు. ఓ నేతకు చెందిన సెల్ ఫోన్ చోరీకి గురైంది.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. పలు జిల్లాల నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు దీటుగా బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రణాళికలు వేసుకుంటోంది.
రెండు రోజుల క్రితమే ఖమ్మం లోక్‌సభ సమీక్ష సమావేశం జరిగింది. ఇవాళ మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు.
దీంతో తెలంగాణ భవన్ వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఈ సమయంలోనే జేబుదొంగలు ప్రవేశించి తమ బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. రద్దీ, హడావిడి ఉండే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని జేబుదొంగలు రెచ్చిపోతున్న ఘటనలు ఇటీవలే ఇతర ప్రాంతాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి.
Jogi Ramesh: జోగి రమేశ్ సీటు మార్పు.. పెడన నుంచి బరిలో ఎవరో తెలుసా?