Platform Ticket Rates : ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Secunderabad Railway Station

Platform Ticket Rates :  రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే.  సికింద్రాబాద్, హైదరాబాద్ లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50 నుంచి రూ. 20 కి తగ్గించారు.

మిగతా స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 కితగ్గిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు కోరారు. ప్లాట్ ఫాం టికెట్లను నేరుగా కౌంటర్ వద్ద కానీ, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారుల తెలిపారు.