Child Murder : సింగరేణి కాలనీ చిన్నారి మర్డర్ కేసు నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో రాజును అదుపులోకి తీసుకున్నారు.
- bheemraj
- Published On : September 11, 2021 / 12:53 PM IST
Accused
Police arrested accused : హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో రాజును అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడి కోసం పది పోలీసు బృందాలు గాలించి పట్టుకున్నాయి.
గురువారం (సెప్టెంబర్10, 2021) సాయంత్రం 5 గంటల నుంచి బాలిక ఆచూకి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులకు ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలుకొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీళ్లపర్యంతమయ్యారు.
Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు
జులాయిగా తిరిగే రాజు…దొంగతనాలు చేస్తుంటాడని స్థానికులు తెలిపారు… ఇప్పటికే దురలవాట్లకు బానిసైన రాజు భార్యను తరచూ కొట్టేవాడని… దీంతో భార్య విడిచి వెళ్లిపోయిందన్నారు.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడని… కాలనీలో సైకో చేష్టలతో ఇబ్బందులకు గురి చేసేవాడని చెబుతున్నారు.. అందుకే పాప కనిపించకపోవడంతో మొదట అతనిపైనే అనుమానంతో వెళ్లి చూస్తే పాప మృతదేహం కనిపించింది.
దీంతో మృతురాలి కుటుంబసభ్యులు, సింగరేణికాలనీ వాసులు రగిలిపోయారు. రాజును తమకు అప్పగించాలని, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజును తమకు అప్పగించకపోతే పాప మృతదేహాన్ని కదలనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు.
