Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. దీంతో బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు.

Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

Child

Updated On : September 10, 2021 / 7:36 AM IST

child raped and murdered : హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. దీంతో బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు. నిందితుడిని తమకు అప్పగించాలని రాత్రంతా ఆందోళనకు దిగారు.

నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించలేదు. ఎంత వెతికినా కుటుంబసభ్యులకు కనిపించలేదు. అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

జులాయిగా తిరిగే రాజు…దొంగతనాలు చేస్తుంటాడు. దుర్వ్యసనాలకు బానిసై భార్యను తరచూ కొట్టేవాడు. నిత్యం కొడుతూ భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఒంటరిగా ఉండే అతగాడు.. సైకో చేష్టలపై అనుమానంతో వెళ్లి చూస్తే పాప మృతదేహం కనిపించడంతో మృతురాలి కుటుంబ సభ్యులు, సింగరేణికాలనీ వాసులు రగిలిపోయారు.

రాజును తమకు అప్పగించాలని, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజును తమకు అప్పగించకపోతే పాప మృతదేహాన్ని కదలనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. ఘటనాస్థలిలో క్లూస్‌ సేకరించిన పోలీసులు… రాజు కోసం గాలింపు చేపట్టారు.